Wednesday, May 30, 2012

నీ మధురారవిందమే ..

తొలి పొద్దులోని  అందాన,
మలి పొద్దులోని సింధూర వర్ణాల చందాన,
ఆమని కోయిల ఆనందాన,
పూలలోని మకరందాన,
ఎటు చూసినా ..........ముకుందా
మరి   కానవచ్చె నీ మధురారవిందమే ..

న్యాయమా కన్నయ్యా ?

మొన్న బృందావిహారిగా చూసినంతనే 
                      మిన్నునంటిన నా ఆనందమేమని వర్ణించను 
నిన్ను చుసిన క్షణాన వెన్నలా కరిగిపోతాననుకున్న నన్ను,
                       ఈ జగాన మన్నులా మిగల్చడం న్యాయమా కన్నయ్యా ?